రేవంత్‌కు షాక్.. కేబినెట్ భేటీకి ఈసీ బ్రేకులు
ఓ వైపు లోక్‌సభ ఎన్నికల కోడ్, మరోవైపు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండడంతో కేబినెట్ భేటీకి పర్మిషన్ నిరాకరించింది ఎన్నికల సంఘం.
ఎలక్షన్ కమిషన్ సీఎం రేవంత్ రెడ్డికి షాకిచ్చింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన కేబినెట్ భేటీకి బ్రేకులు వేసింది. రెండు రోజుల క్రితమే నేడు కేబినెట్ భేటీ ఉంటుందని అధికార వర్గాలు ప్రకటించాయి.
రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య విభజన పంపకాలు, వివాదాలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు మంత్రి మండలి సమావేశాన్ని నిర్ణయించారు. ఇక రాష్ట్ర ఆదాయ పెంపు మార్గాలపైనా ఈ సమావేశంలో చర్చించాలని కేబినెట్ ప్లాన్ చేసింది.
అయితే ఓ వైపు లోక్‌సభ ఎన్నికల కోడ్, మరోవైపు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండడంతో కేబినెట్ భేటీకి పర్మిషన్ నిరాకరించింది ఎన్నికల సంఘం. మంత్రి మండలి సమావేశం ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ పేర్కొంది. ఈనెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈనెల 13న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియగా.. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరగనుంది.