గద్వాల ఎమ్మెల్యే నేనే.. ప్రమాణ స్వీకారం చేస్తా..!

ప్రమాణ స్వీకారోత్సవ విషయంలో గవర్నర్ సాయం కోరారు డీకే అరుణ. హైకోర్టు తీర్పు కాపీని, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గెజిట్ ను గవర్నర్ కు అందించారు.

Advertisement
Update:2023-09-09 06:32 IST

గద్వాల నియోజకవర్గ ఎన్నికలపై ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చింది. రెండో స్థానంలో ఉన్న డీకే అరుణను విజేతగా ప్రకటించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడటం, రేపో మాపో నోటిఫికేషన్ అన్న తరుణంలో ఆమె ప్రమాణ స్వీకారం జరుగుతుందా లేదా అనేది డైలమాలో పడింది. కానీ డీకే అరుణ మాత్రం ఎమ్మెల్యేగా తాను ప్రమాణ స్వీకారం చేసి తీరుతానంటున్నారు. ఈ విషయమై ఆమె నేరుగా గవర్నర్ తమిళిసైని కలిశారు. తన ప్రమాణ స్వీకారానికి సహకరించాలని కోరారు.


ప్రభుత్వంపై నిందలు..

ఆగస్ట్ 24న డీకే అరుణను హైకోర్టు ఎమ్మెల్యేగా గుర్తించింది, ఆమె విజేత అంటూ ప్రకటించింది. సెప్టెంబర్-2న కేంద్ర ఎన్నికల సంఘం కూడా గెజిట్ విడుదల చేసింది. అయితే ప్రమాణ స్వీకారం చేస్తేనే అధికారికంగా ఆమె ఎమ్మెల్యే అవుతారు. ఈమేరకు తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిని కలిసేందుకు రెండు సార్లు వెళ్లానని, వారు అందుబాటులో లేరని అంటున్నారు డీకే అరుణ. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని, ఉద్దేశపూర్వకంగానే వారు ఆలస్యం చేస్తున్నారంటూ గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. తన ప్రమాణ స్వీకారోత్సవ విషయంలో గవర్నర్ సాయం చేయాలని కోరారు. హైకోర్టు తీర్పు కాపీని, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గెజిట్ ను గవర్నర్ కు అందించామని చెప్పారు. ఈ విషయంలో గవర్నర్ తమిళి సై సానుకూలంగా స్పందించారన్నారు.

ఇంతకీ అరుణ ఏ పార్టీ ఎమ్మెల్యే..?

విజేతగా గుర్తింపు తెచ్చుకున్న డీకే అరుణ ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. 2018లో గద్వాల బరిలో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచారు. 71,612 ఓట్లు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె బీజేపీ లీడర్. ఇప్పపుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఆమె ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నారు. ఎన్నికల సమయంలోనే ఆమె గెలిచి, తర్వాత పార్టీ మారితే అదేమీ విశేషం కాదు, కానీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు, ప్లేట్ ఫిరాయించిన చాలా కాలానికి హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే అవుతున్నారు. ఇంతకీ ఆమె ఏ పార్టీ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. 

Tags:    
Advertisement

Similar News