నాగార్జునకు రేవంత్ షాక్.. N- కన్వెన్షన్ కూల్చివేత
తమ్మిడికుంట చెరువులో మూడు ఎకరాల 30గుంటలను ఆక్రమించి N-కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. నగరవ్యాప్తంగా ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా, వాటిని కూల్చివేసే పనిలో హైడ్రా ఉంది. ఇప్పటికే గండిపేట పరిధిలోని ఆక్రమణలపై దృష్టి సారించిన హైడ్రా అక్కడ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జునకు చెందిన N- కన్వెన్షన్ సెంటర్‌ను సైతం హైడ్రా కూల్చేసింది.
ఉదయం ఆరుగంటలకే మాదాపూర్ N- కన్వెన్షన్ చేరుకున్న హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. తమ్మిడికుంట చెరువులో మూడు ఎకరాల 30గుంటలను ఆక్రమించి N-కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. FTL పరిధిలో నిర్మించిన N-కన్వెన్షన్ సెంటర్‌ను తక్షణం కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్‌కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నాగార్జున N-కన్వెన్షన్‌ను కూల్చేశారు హైడ్రా అధికారులు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు