మహిళల కోసం సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ప్రారంభం
దేశంలోనే తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్‌ను ప్రారంభిస్తున్నట్టు ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ప్రారంభిస్తున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ దీనిని ఏర్పాటు చేసింది. మంగళవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవ సంబరాల్లో.. ఈ హెల్ప్ లైన్‌ను మంత్రి సబిత ఆవిష్కరించారు.
దేశంలోనే తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్‌ను ప్రారంభిస్తున్నట్టు ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మహిళలంతా తప్పనిసరిగా 87126 62662 నంబర్‌ను సేవ్ చేసుకోవాలని సూచించారు. `జాతి రత్నాలు` చిత్ర హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, `బలగం` చిత్ర హీరో ప్రియదర్శి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సందేశాన్ని అందించారు.