తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు!

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే యోచనలో టీపీసీసీ ఉంది.

Advertisement
Update:2025-02-04 19:28 IST

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు హస్తం పార్టీ సిద్దమైంది. ఆయన షోకాజ్ నోటీసులు పంపాలని క్రమశిక్షణ కమీటీ నిర్ణయించింది. మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని సొంత కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. తీన్మార్‌ మల్లన్నపై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కు నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల మల్లన్న ఓ బహిరంగ సభలో బీసీ కులగణన సహా పలు అంశాలపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడిన విషయం తెలిసిందే. !బీసీ కులగణనపై తీన్మార్ మల్లన్న కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తీన్మార్ మల్లన్న పరిధి దాటి మాట్లాడితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News