అద్దంకికి మళ్లీ హ్యాండ్.. మొన్నే బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్

అద్దంకి దయాకర్‌.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అత్యంత దురదృష్టవంతుడు. గడిచిన 9 ఏళ్లలో ప్రతిపక్షంలో అనేక వేదికల్లో కాంగ్రెస్‌కు గొంతుగా నిలిచాడు. పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడిచినప్పటికీ అద్దంకి దయాకర్‌ భవిష్యత్ ఏంటనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలింది.

Advertisement
Update:2024-04-06 15:22 IST

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇటీవలే బీజేపీ నుంచి వచ్చిన గణేష్‌ నారాయణన్‌కు టికెట్ ఇచ్చింది. మరోసారి అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్‌ అధిష్టానం హ్యాండిచ్చింది. కంటోన్మెంట్‌ నుంచి అద్దంకిని పోటీ చేయిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, చివరి నిమిషంలో అద్దంకిని పక్కన పెట్టేసింది కాంగ్రెస్‌. అద్దంకి ద‌యాక‌ర్‌ను ఎందుకు పక్కన పెట్టారనే దానిపై పొలిటికల్‌ సర్కిల్లో మళ్లీ చర్చ మొదలైంది.

అద్దంకి దయాకర్‌.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అత్యంత దురదృష్టవంతుడు. గడిచిన 9 ఏళ్లలో ప్రతిపక్షంలో అనేక వేదికల్లో కాంగ్రెస్‌కు గొంతుగా నిలిచాడు. పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడిచినప్పటికీ అద్దంకి దయాకర్‌ భవిష్యత్ ఏంటనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలింది.అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేయాలనుకున్న అద్దంకి.. చివరికి పార్టీ ఆదేశాల మేరకు తుంగతుర్తి సీటును త్యాగం చేశాడు. దీంతో అద్దంకికి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, అదీ జరగలేదు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయనకు వరంగల్‌ టికెట్‌ ఇస్తారనే ప్రచారం జరిగినా అప్పుడూ హ్యాండిచ్చేశారు. కనీసం కార్పొరేషన్‌ ఛైర్మన్ల జాబితాలోనూ అద్దంకికి చోటు దక్కలేదు.

తాజాగా కంటోన్మెంట్‌నుంచి అద్దంకిని పోటీ చేయించి ఆయన్ని కూల్‌ చేస్తారనుకుంటే సక్సెస్‌ఫుల్‌గా మళ్లీ హ్యాండిచ్చేశారు అన్న చర్చ జరుగుతోంది. అద్దంకి దయాకర్‌కు ఎలాంటి పదవులు రాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుకుంటున్నారని బలంగా ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా అద్దంకి చేసిన వ్యాఖ్యలతో నొచ్చుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌.. ఆయన పదవులకు అడ్డంకిగా మారారని సమాచారం. మొన్నటి ఎన్నికల్లో గద్దర కూతురు వెన్నెలకు కంటోన్మెంట్‌ టిక్కెట్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లాస్య నందితపై వెన్నెల ఓడిపోయింది. కారు ప్రమాదంలో లాస్య నందిత మృతితో ఈ ఉపఎన్నిక వచ్చింది.

Tags:    
Advertisement

Similar News