చీకట్లోనే దీక్షా దివస్ పాదయాత్ర
బసవతారకం హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ వరకు స్ట్రీట్ లైట్లు బంద్
దీక్షా దివస్ పై సర్కార్ కక్షసాధింపు చర్యలకు దిగింది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ వరకు దీక్షా దివస్ సందర్భంగా శుక్రవారం సాయంత్రం బీఆర్‌ఎస్ పాదయాత్ర తలపెట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ కూడా పార్టీ నేతలు ముందుగానే ప్రకటించారు. బసవతారకం హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ మధ్య ఉన్న స్ట్రీట్ లైట్లను శుక్రవారం సాయంత్రం బంద్ పెట్టారు. దీంతో చీకట్లోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు చీకట్లోనే పాదయాత్రగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. స్ట్రీట్ లైట్లు ఆపేయడంపై బీఆర్‌ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ స్పందించారు.. దీక్షా దివస్ పై ప్రభుత్వం చిల్లర ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాయో రేవంత్ ప్రభుత్వం అంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి చీకటి రోజులే మిగులుతాయని హెచ్చరించారు.