ట్రాఫిక్ చలాన్లపై రాయితీ.. నేటితో ముగియ‌నున్న గ‌డువు

ఇప్పటివరకూ దాదాపు కోటి 54 లక్షల 79 వేల 798 లక్షల చలాన్లు క్లియర్ అయినట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో దాదాపు 200 కోట్లకుపైగా ఆదాయం వచ్చిందని తెలుస్తోంది.

Advertisement
Update:2024-01-31 09:36 IST

పెండింగ్‌ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్‌ ఇవాల్టితో ముగియనుంది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలాన్లు రాయితీతో చెల్లించేందుకు డిసెంబర్‌ 26 నుంచి ప్రభుత్వం 15 రోజులు అవకాశం కల్పించింది. సాంకేతిక సమస్యల కారణంగా దాన్ని ఈనెల 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. మరోసారి గడువు పొడిగించేది లేదని అధికారులు ఇప్పటికే స్పష్టంచేశారు.

ఇప్పటివరకూ దాదాపు కోటి 54 లక్షల 79 వేల 798 లక్షల చలాన్లు క్లియర్ అయినట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో దాదాపు 200 కోట్లకుపైగా ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. మరో 10 లక్షలకుపైగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు చెప్తున్నారు.

టూ వీలర్స్‌, ఆటోల చలాన్లపై 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించింది. ఈ-చలాన్‌ వెబ్‌సైట్‌, పేటీఎం ద్వారా చలాన్లు చెల్లించుకునే అవకాశం కల్పించారు. కేవలం పేటీఎం ద్వారానే 60 కోట్లకుపైగా చలాన్ చెల్లింపులు జరిగాయని అధికారులు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News