రేవంత్‌ కామెంట్స్‌.. నిండు సభలో సబిత కన్నీరు!

CM వ్యాఖ్యలతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తాను ఎవరినీ మోసం చేయలేదన్నారు. రేవంత్ రెడ్డిని ఆనాడూ తానే కాంగ్రెస్ పార్టీలోకి నిండు మనసుతో ఆహ్వానించార‌న్నారు సబిత.

Advertisement
Update:2024-07-31 15:08 IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సభలో గందరగోళం సృష్టించాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో సబిత కన్నీరు పెట్టుకున్నారు. తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఇంతకీ రేవంత్ ఏమన్నారంటే?

కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. వెనుక ఉన్న అక్కల మాటలు నమ్మితే ( సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి) జేబీఎస్ బస్టాండ్‌లో నిలబడాల్సి వస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. సబితా ఇంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తాను ఎవరినీ మోసం చేయలేదన్నారు. రేవంత్ రెడ్డిని ఆనాడూ తానే కాంగ్రెస్ పార్టీలోకి నిండు మనసుతో ఆహ్వానించార‌న్నారు సబిత. రేవంత్‌ రెడ్డికి తనపై ఎందుకింత‌ కక్ష అని ప్రశ్నించారు.

తర్వాత మళ్లీ మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. తనను సబితక్క కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మాట వస్తామనేని.. తాను కూడా సబిత ఇంద్రారెడ్డిని సొంత అక్కలాగా భావించానని చెప్పారు. కొడంగల్‌లో తాను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత..కాంగ్రెస్ హైకమాండ్ తనకు మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించిందని.. ఆరోజు సబితక్క దగ్గరికి వెళ్లి మద్దతు తెలపాలని కోరానన్నారు. సబితక్క తనకు మద్దతు ఇస్తానని చెప్పి మాట తప్పిందన్నారు రేవంత్‌. కేసీఆర్ మాయ మాటలను నమ్మి ఆనాడు టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొందిందని అన్నారు. తన ఓటమికి మాజీ మంత్రి సబితా ప్రయత్నించిందన్నారు రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు మద్దతు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News