ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను పరామర్శించారు.;
Advertisement
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. వంశీకృష్ణ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వంశీకృష్ణను ముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం వైద్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంశీకృష్ణ త్వరగా కోలుకొని, తిరిగి ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు.
Advertisement