పదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యం
రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికే మెగా మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించామన్న డిప్యూటీ సీఎం;
రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికే మెగా మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. చైనా ప్లస్ వన్ వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాములు ఏర్పాటు చేస్తామన్నారు. ఐకేపీ కేంద్రా్లలో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తామన్నారు. ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామన్నారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు కేటాయిస్తామన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు.