మార్చి 2026 నాటికి రాష్ట్ర అప్పులు రూ. 5,04,814 కోట్లు

బడ్జెట్‌లో ప్రతిపాదించిన రుణాలు రూ. 69,639 కోట్లని, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 29,899 కోట్లు వస్తాయని అంచనా;

Advertisement
Update:2025-03-19 14:05 IST

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది రాష్ట్రానికి వచ్చే ఆదాయం గురించి అంచనా లెక్కలు వేశారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (మార్చి-2026) అప్పుల అంచనా రూ. 5,04,814 కోట్లు అని తెలిపారు. రాష్ట్ర సొంత పన్నుల రాబడి రూ. 1,45, 419 కోట్లని అంచనా వేశారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన రుణాలు రూ. 69,639 కోట్లని, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 29,899 కోట్లు వస్తాయని వివరించారు. పన్నేతర ఆదాయం 31,618 కోట్లని, కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 22,782 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి అప్పులు రూ. 5,04,814 కోట్లని తెలిపారు. జీఎస్డీపీలో అప్పుల శాతం 28.1, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల నుంచి వచ్చే ఆదాయం రూ. 19,087 కోట్లని, ఎక్సైజ్‌ శాఖ నుంచి రూ. 27,623 కోట్లని, అమ్మకం పన్ను ఆదాయం రూ. 37,463 కోట్లని, వాహనాలపై వేసే పన్నుతో రూ. 8,535 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు.

Tags:    
Advertisement

Similar News