అప్పులపై కాంగ్రెస్‌ది అసత్య ప్రచారమని తేలింది

ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్‌ బుక్‌తో పాటు సోషియో ఎకనమిక్ ఔట్‌ లుక్‌ బుక్‌లో వాళ్ల అసత్యాలను ఎండగట్టేలా ఉన్నదన్న ఎమ్మెల్సీ కవిత;

Advertisement
Update:2025-03-19 14:19 IST

తెలంగాణ రాష్ట్రం అప్పు 2014 నుంచి ఈరోజు వరకు రూ.4,37,000 కోట్లు అని బడ్జెట్లో పేర్కొన్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పారు. అవి అబద్ధాలని మేము పదే పదే నిరూపిస్తున్నాం. ఈ రోజు బడ్జెట్‌ పుస్తకంలో అదే తేటతెల్లమైందన్నారు.

కేసీఆర్ చేసిన అప్పుల గురించి గతంలో రేవంత్ రెడ్డి చేసినవన్ని అసత్య ప్రచారాలని ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా తేలిపోయింది రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.4,37,000 కోట్లు అని ప్రభుత్వమే చెప్పింది. ఈ అప్పుల్లోనూ ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒప్పుకున్నరూ. 1,58,000 కోట్లు కూడా ఉన్నాయి. కానీ కేసీఆర్‌ రూ. 7.5 లక్షల కోట్లు అప్పు చేశారని మాట్లాడారు. కేసీఆర్‌ చేసిన అప్పులపై తప్పుడు ప్రచారం చేశారని ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్‌ బుక్‌తో పాటు సోషియో ఎకనమిక్ ఔట్‌ లుక్‌ బుక్‌లో వాళ్ల అసత్యాలను ఎండగట్టేలా ఉన్నది. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాల్సిందిగా కోరుతున్నాం.

Tags:    
Advertisement

Similar News