కేటాయింపులు గణం.. వాస్తవ ఖర్చులు శూన్యం

గత బడ్జెట్‌లో కేటాయింపులు ఖర్చు చూస్తే ఇదే విషయం తేటతెల్లం;

Advertisement
Update:2025-03-19 13:37 IST

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించే అంకెలకు ఆచరణలో పెట్టే ఖర్చులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఉదాహరణకు గత బడ్జెట్‌లో రుణమాఫీ కోసం రూ. 26, 000 వేల కోట్లు కేటాయించారు. కానీ రుణమాఫీకి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 21,000 వేల కోట్లు. అందుకే రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని రైతులు రోడ్లపైకి వస్తున్నారు. అయితే రాష్ట్రంలో రూ. 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసింది. ఇప్పటివరకు 25.35 లక్షల మంది రైతులకు 20,616.89 కోట్లు రుణమాఫీ చేసినట్లు భట్టి తెలిపారు. కాబట్టి ఇక రుణమాఫీ సంగతి ఒడిసిన ముచ్చటే. ఇప్పటివరకు సాంకేతి కారణాలు, ఆధార్‌ సంబంధిత సమస్యల పేరుతో కాలయా పన చేసిన ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేసినట్లు చెప్పింది.

ఇక సన్న వడ్లకు రూ. 500 బోనస్‌ ఇస్తామన్నది కూడా బోగసే అని తేలిపోయింది. గత బడ్జెట్‌లో ఇందుకోసం రూ. 1800 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది రూ. 12, 00 కోట్లు మాత్రమే. అందుకే సన్నా వడ్లకు బకాయిలు ఇంకా రూ. 300 కోట్ల వరకు ఉన్నాయని ఇటీవల పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇక ఆరుగ్యారెంటీలకు కూడా ప్రభుత్వం మంగళం పాడింది. ఇప్పటికే మంత్రి పొన్నం మండలిలో తులం బంగారం ఇవ్వలేం. మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయలేమని చెప్పారు. ఈసారి బడ్జెట్లోనూ మహాలక్ష్మి (ఆర్టీసీ బస్సు) రూ. 4,305 కోట్లు కేటాయించారు. గృహ జ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ) కు కూడా రూ. 2,080 కోట్లు కేటాయించారు. అయితే ఈ పథకం అందరికీ అమలుకావడం లేదు. అలాగే గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ ముచ్చట కూడా అంతే బడ్జెట్‌లో కేటాయింపులు అంతంత మాత్రమేన. ఈసారి ఆ పథకానికి రూ. 723 కోట్లు కేటాయించింది. దీన్నిబట్టి చూస్తే కేటాయింపులు గణం.. ఖర్చు శూన్యమని స్పష్టంగా కనిపిస్తున్నది.

Tags:    
Advertisement

Similar News