ఈ నెల 14న హస్తినకు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి 14న ఢిల్లీకి వెళ్లనున్నారు

Advertisement
Update:2025-01-09 21:56 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 14న హస్తినకు వెళ్లనున్నారు. ఈనెల 15న ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆరోజు సాయంత్రం, 16న పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి విన్నవించనున్నారు. 17న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లనున్న సీఎం.. అక్కడ రెండు రోజుల పర్యటన కొనసాగించనున్నారు. అనంతరం 19వ తేదీన సింగపూర్ నుంచి దావోస్ వెళ్లనున్నారు. దావోస్ లో జరగనున్న ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొని, రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ఇదే పర్యటనలో ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉండాగా రద్దయ్యింది.

Tags:    
Advertisement

Similar News