కరెంటు కోతలు.. సీఎం రేవంత్ వింత సమాధానం
కొంతమంది లైన్‌మెన్లు ఉద్దేశపూర్వకంగానే కరెంటు కట్ చేస్తున్నారన్నారు రేవంత్. ప్రధానంగా వీఐపీలు ఉన్న ప్రాంతాల్లో కరెంటు కోతల సమస్య ఉందన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా మీట్ ది మీడియా కార్యక్రమంలో మాట్లాడారు రేవంత్. రాష్ట్రంలో నీటి సమస్య, కరెంటు సమస్యలపై స్పందించారు. గత ప్రభుత్వం రిజర్వాయర్లలో సరిగ్గా నీరు నిల్వ చేయలేదన్నారు.
కరెంటు కోతలపై వింత సమాధానం ఇచ్చారు రేవంత్. అవసరమున్నదానికంటే ఎక్కువగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. అయినప్పటికీ విద్యుత్ కోతలు ఉంటున్నాయన్నారు. ఈ అంశంపై పరిశోధిస్తే.. కొంతమంది లైన్‌మెన్లు ఉద్దేశపూర్వకంగానే కరెంటు కట్ చేస్తున్నారన్నారు రేవంత్. ప్రధానంగా వీఐపీలు ఉన్న ప్రాంతాల్లో కరెంటు కోతల సమస్య ఉందన్నారు.
పలువురు లైన్‌మెన్‌లను ఉద్యోగాల నుంచి తీసివేసిన తర్వాత కొంత పరిస్థితి మెరుగైందన్నారు రేవంత్. కొంతమంది సైకో ఫ్యాన్స్ ఉంటారని..ప్రభుత్వం ఫెయిలైందని..ప్రచారం చేసేందుకు ఇలా చేస్తున్నారని చెప్పారు. అక్కడక్కడ కొన్ని గంజాయి మొక్కలు ఉన్నాయని, వాటిని ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు రేవంత్.