సీఎం రేవంత్‌రెడ్డికి వాస్తు భయం..సెక్రటేరియట్‌ వాస్తు మార్పులు

తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి గేటును మూసివేయనున్న ప్రభుత్వం

Advertisement
Update:2024-11-06 21:45 IST

తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తు సమస్య కారణంగా ఈశాన్య దిశలో మరో కొత్త గేటును నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని కోసం రూ.3.2 కోట్లతో టెండర్లను పిలిచి పనులను ప్రారంభించిన ప్రభుత్వం.బాహుబలి గేట్లకు ఎదురుగా ఉన్న మెయిన్‌ గేటును పూర్తిగా తొలగించనున్నారు.

హుస్సేన్‌ సాగర్‌ గేటు నుంచి ప్రవేశించి.. గేటు 3 నుంచి ముఖ్యమంత్రి బయటకు వెళ్లనున్నారు. ఎన్టీఆర్ మార్గ్ ఎంట్రీ నుంచి సౌత్ ఈస్ట్ గేటు వరకు ఎదురుగా కొత్త రోడ్డు నిర్మాణం చేయనుంది. గేట్ నెంబర్ 3 కి ఎదురుగా హుస్సేన్‌ సాగర్ వైపు మరో కొత్త గేటును పెట్టనుంది.మరో రెండు, మూడు రోజుల్లో గతంలో మూసిన ప్రధాన ద్వారాన్ని పూర్తిగా ప్రభుత్వం తొలగించనుంది. తెలంగాణ సచివాలయం భద్రత విధుల్లో తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (టీజీఎస్పీఎఫ్‌) చేరిన సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News