షర్మిల డబ్బు సంచులా.. నర్సంపేట ఆత్మగౌరవమా - కేసీఆర్‌

నర్సంపేట ప్రజాశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్‌.. నర్సంపేటకు ఓ ప్రత్యేకత ఉందన్నారు. సమైక్యవాదులు వచ్చి ఇక్కడ రాజ్యం చేస్తామంటే సుదర్శన్ రెడ్డి నిరసన తెలిపారని గుర్తుచేశారు.

Advertisement
Update:2023-11-13 20:00 IST

తెలంగాణలో పోలింగ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో పొలిటికల్‌ హీట్‌ పీక్స్‌కు చేరింది. ప్రజా ఆశీర్వాద స‌భలతో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్‌.. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడిని డైరెక్ట్‌గా పేరు ప్రస్తావించి విమర్శలు చేయరు కేసీఆర్‌. కానీ, ఫస్ట్ టైమ్‌ తన వైఖరికి భిన్నంగా వైఎస్ షర్మిల పేరును ప్రస్తావించిన కేసీఆర్‌.. ఆమెపై మండిపడ్డారు. సమైక్యవాదులు, పరాయి రాష్ట్రం వాళ్లు అంటూ షర్మిలపై విరుచుకుపడ్డారు.

నర్సంపేట ప్రజాశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్‌.. నర్సంపేటకు ఓ ప్రత్యేకత ఉందన్నారు. సమైక్యవాదులు వచ్చి ఇక్కడ రాజ్యం చేస్తామంటే సుదర్శన్ రెడ్డి నిరసన తెలిపారని గుర్తుచేశారు. నిరసన తెలిపినందుకు షర్మిల.. పెద్ది సుదర్శన్‌ రెడ్డిపై పగ పెంచుకుందన్నారు కేసీఆర్‌. పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డిని ఓడించేందుకు షర్మిల డబ్బు కట్టలు పంపిస్తోందంటూ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల పంపించే డబ్బు కట్టలు గెలవాలో.. మన మిషన్‌ భగీరథ మంచినీళ్లు.. 24 గంటల కరెంటు గెలవాలో.. ఆలోచించుకోవాలని నర్సంపేట ప్రజలకు పిలుపునిచ్చారు.


ఆరునూరైనా 2018 కంటే ఎక్కువ సీట్లతోని బీఆర్ఎస్ గెలవబోతోందన్నారు కేసీఆర్‌. నర్సంపేట అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని.. అప్పుడే లాభం జరుగుతుందన్నారు కేసీఆర్‌.

Tags:    
Advertisement

Similar News