స్వచ్ఛ హుస్సేన్ సాగర్.. ఆ కల ఇప్పుడైనా సాకారం అవుతుందా..?

హుస్సేన్ సాగర్ లోకి మురికినీరు రాకుండా ఆపడం సాధ్యం కాదు. అయితే వచ్చే నీటిని శుద్ధి చేసి వ్యర్థాలను తీసివేస్తే కొంతవరకు ఆ ప్రయత్నంలో విజయం సాధించినట్టే.

Advertisement
Update:2024-03-06 15:44 IST

మురికి నీరు లేని హుస్సేన్ సాగర్ ని చూడాలని, దుర్వాసన లేని సాగర్ పరిసరాల్లో విహరించాలని సగటు హైదరాబాదీ కల. ప్రభుత్వాల ప్రయత్నాలను శంకించలేం కానీ.. పూర్తి స్థాయిలో ఆ కల మాత్రం నెరవేరలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు మొదలు పెట్టింది. తాజాగా రూ.7.19 కోట్లు వెచ్చించి ప్రైవేటు సంస్థలకు ఆ బాధ్యతలు అప్పగించారు అధికారులు. ఇప్పటికైనా ఈ శుద్ధి కార్యక్రమం ఓ కొలిక్కి వస్తుందేమో చూడాలి.

హుస్సేన్‌సాగర్‌లోకి వచ్చే మురుగునీటికి చెక్‌ పెట్టేందుకు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం మూడు చోట్ల ఉన్న సీవేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్(STP)లతో పాటు మొత్తం 7 చోట్ల ఉన్నI&D నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. 14 నెలల పాటు హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరు చేరకుండా, శుద్ధి చేసిన నీటిని మాత్రమే వదిలేలా పనులను కాంట్రాక్టర్లకు అప్పగించబోతున్నారు. ఇందుకోసం మొత్తం రూ.7.19 కోట్లు వెచ్చిస్తోంది ప్రభుత్వం.

హుస్సేన్ సాగర్ లోకి మురికినీరు రాకుండా ఆపడం సాధ్యం కాదు. అయితే వచ్చే నీటిని శుద్ధి చేసి వ్యర్థాలను తీసివేస్తే కొంతవరకు ఆ ప్రయత్నంలో విజయం సాధించినట్టే. ఈ ప్రక్రియ ఏళ్లతరబడి సాగుతున్నా కూడా పూర్తి స్థాయిలో స్వచ్ఛ సాగర్ అనేది సాధ్యం కావడం లేదు. బీఆర్ఎస్ హయాంలో జోరుగా సాగిన శుద్ధి పనులను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. హైదరాబాద్ కి సంబంధించి మూసీ నది ప్రక్షాళణ ప్రధాన అజెండాగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి, హుస్సేన్ సాగర్ పరిశుభ్రతపై కూడా ఫోకస్ పెట్టారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News