మహబూబాబాద్ ధర్నాకు అనుమతి నిరాకరణ..బీఆర్‌ఎస్ నేతలు నిరసన
రాష్ట్రంలో గిరిజనులు, దళితలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు
Advertisement
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆధ్వర్యంలో మహా ధర్నాకు మహబూబాబాద్ ఎస్పీ అనుమతి ఇవ్వలేదు. దీంతో మహబూబాబాద్ ఎస్పీ కార్యాలయంలో ముందు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్,ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ధర్నాకి దిగారు. లగచర్ల దాడి, గిరిజన రైతుల సమస్యలు, ఎన్నికల హామీలు అమలు చేయాలని ఈనెల 21న బీఆర్‌ఎస్ ధర్కాకు పిలుపునిచ్చింది. రేపు మహబూబాబాద్ తహశీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన, దళిత, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా నిర్వహిస్తున్న మహా ధర్నాలో పాల్గొననున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ నుంచి వచ్చే దారిలో కొందరు యువకులతో కాంగ్రెస్ శ్రేణులు రాళ్లతో దాడికి ప్లాన్ చేస్తున్నట్టు టాక్
Advertisement