కడియం ముందే ఫైటింగ్.. మధ్యలోనే వెళ్లిపోయిన తండ్రీకూతురు
బీఆర్‌ఎస్‌లో ఉన్న లింగాలఘనపురం జడ్పీటీసీ వంశీధర్‌రెడ్డి, మరికొందరు ముఖ్యనేతలు ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. వీరి చేరికను వ్యతిరేకిస్తూ జడ్పీటీసీ వంశీధర్‌రెడ్డి ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలను ఓ వర్గం చించేసింది.
స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సింగపురం ఇందిర సాక్షిగా లింగాలఘనపురం మండలంలో విభేదాలు బయటపడ్డాయి. లింగాల ఘనపురం మండలం నెల్లుట్లలో ఎంపీ ఎన్నికల సమీక్షా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి కొందరు నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ ఓ వర్గం ఆందోళన చేయడం గొడవకు కారణమైంది. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బీఆర్‌ఎస్‌లో ఉన్న లింగాలఘనపురం జడ్పీటీసీ వంశీధర్‌రెడ్డి, మరికొందరు ముఖ్యనేతలు ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. వీరి చేరికను వ్యతిరేకిస్తూ జడ్పీటీసీ వంశీధర్‌రెడ్డి ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలను ఓ వర్గం చించేసింది. మరోవర్గం అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాటామాటా పెరిగింది. ఇరువర్గాలు పరస్పరం దాడిచేసుకున్నాయి. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కడియం, అభ్యర్థి కావ్య మధ్యలోనే వెళ్లిపోయారు. తాజా పరిణామాల నేపథ్యంలో కావ్యకు ఓటమి భయం పట్టుకుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాడర్ సహకరిస్తుందా లేదా అని కడియం శ్రీహరి సైతం ఆందోళన చెందుతున్నారని టాక్.