రేవంత్‌ సర్కార్‌ బాటలోనే చంద్రబాబు!

శ్వేతపత్రాల విడుదల అంటే ఓ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. హామీల అమలుపై ఆశలు వదులేసుకోవాలని ముందస్తుగా హింట్ ఇవ్వడం అన్నమాట.

Advertisement
Update:2024-06-13 10:29 IST

ఆంధ్రప్రదేశ్‌లో కొలువు దీరిన కూటమి ప్రభుత్వం.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బాటలో నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్‌ ప్రభుత్వం శాఖల వారీగా శ్వేతపత్రాలంటూ హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే ప్లాన్‌లో ఉన్నారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన తర్వాతే హామీల అమలు మొదలు పెట్టనున్నారు.


బుధవారం ప్రమాణస్వీకారం తర్వాత కొత్త మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. శాఖలు కేటాయించిన వెంటనే ఆయా శాఖల పరిస్థితిపై శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని మంత్రులకు సూచించారు. శ్వేతపత్రాల విడుదల అంటే ఓ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. హామీల అమలుపై ఆశలు వదులేసుకోవాలని ముందస్తుగా హింట్ ఇవ్వడం అన్నమాట. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఇదే చేసింది. శ్వేత పత్రాలు విడుదల చేసి రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ ప్రచారం చేసింది.


ఇక గత ప్రభుత్వంలో మంత్రుల దగ్గర పని చేసిన వారిని నియమించుకోవద్దని కొత్త మంత్రులకు సూచించారు చంద్రబాబు. పూర్తిగా కొత్తవారని తీసుకోవాలని మంత్రులను ఆదేశించారు. మంత్రులకు సహాయకులను స్వయంగా తానే నియమిస్తానని చెప్పారు. MBA చేసిన వారిని సహాయకులుగా నియమిస్తానన్నారు. ప్రతి ఫైలును పరిశీలించిన తర్వాతే సంతకం పెట్టాలని మంత్రులకు సూచించారు. మంత్రులకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇప్పిస్తానని చంద్రబాబు చెప్పడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News