ఆంధ్రప్రదేశ్‌లో కూడా కులగణన చేపట్టాలి : వైఎస్ షర్మిల

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.

Advertisement
Update:2025-02-04 16:08 IST

తెలంగాణ కులగణన దేశానికి ఆదర్శమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. భారత దేశ జనాభాలో 90 శాతం బడుగు, బలహీన వర్గాల వారే ఉన్నారని షర్మిల అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూరదృష్టికి తెలంగాణ కులగణన నిదర్శనమని.. వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నామని షర్మిల ఎక్స్ వేదికగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జనాభలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశమన్నారు.

ఏపీ కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నమ్ముతుందన్నారు. మన రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలని.. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలని..మనమెంతో మనకంతా అన్నట్లుగా.. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాలని..జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలని షర్మిల డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News