దేశంలో నిరుద్యోగానికి ఇది సాక్ష్యం కాదా - కేటీఆర్
ప్రఖ్యాత ఐఐటీ బాంబేలో ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏకంగా 36 శాతం మందికి ఉద్యోగం రాకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఐఐటీ నుంచి ఇటీవల గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్న 36 శాతం మందికి ఉద్యోగాలు లేవన్న వార్తా కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీలలో చదివిన విద్యార్థులు కూడా ఉద్యోగం కోసం కష్టపడుతున్నారని.. అది దేశంలో నిరుద్యోగానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు కేటీఆర్.
కొత్త కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న తరుణంలో.. ప్రపంచంలో అత్యధిక యువకులు ఉన్న దేశంగా ఇది చర్చించుకోవాల్సిన అంశం కాదా అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఇందుకు సంబంధించిన వార్తా కథనాలను తన ట్వీట్‌కు యాడ్ చేశారు.
ప్రఖ్యాత ఐఐటీ బాంబేలో ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏకంగా 36 శాతం మందికి ఉద్యోగం రాకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2024 క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం 2000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 36 శాతం మంది.. అంటే 712 మందికి ఉద్యోగాలు రాలేదు. ప్లేస్‌మెంట్స్ పరంగా 2021, 2022 సంవత్సరాల్లో ఐఐటీ బాంబే దేశవ్యాప్తంగా మూడో ర్యాంకులో నిలిచింది. గతేడాది నాలుగో స్థానానికి పడిపోయింది. ఐఐటీ మద్రాస్‌లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఆ క్యాంపస్‌లో దాదాపు 45 శాతం మంది గ్రాడ్యూయేట్లకు ఉద్యోగాలు రాలేదు.