ఎస్సీ వర్గీకరణకు బీఆర్‌ఎస్ మద్దతు.. అసెంబ్లీ నుంచి వాకౌట్

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.

Advertisement
Update:2025-02-04 19:42 IST

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ కోసం ఈ రోజు ప్రత్యేకంగా శాసన సభ సమావేశం నిర్వహించారు. అంతకుముందు సభలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను తాము అడ్డుకున్నట్టు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వర్గీకరణపై కాంగ్రెస్సే పోరాడినట్టు చిత్రీకరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 2014 నవంబర్‌ 29న కేసీఆర్‌ వర్గీకరణపై తీర్మానం పెట్టారు. ఎస్సీ వర్గీకరణపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని కేటీఆర్‌ గుర్తుచేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎస్సీవర్గీకరణ అమలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఆ వెంటనే బీసీ బీసీల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసగా వాకౌట్ చేశారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు బీజేేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. మరోవైపు బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News