మేడ్చల్ - మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించనున్నారు. పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం పై మంగళవారం కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు శంబిపూర్ రాజు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. పార్టీ ఆఫీస్ ప్రారంభాన్ని అట్టహాసంగా నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
Advertisement