30న తెలంగాణ అసెంబ్లీ సమావేశం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించనున్న సభ
Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఈనెల 30న (సోమవారం) ప్రత్యేకంగా సమావేశమవుతుంది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి దేశవ్యాప్తంగా ఏడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సభలో సంతాప తీర్మానం ప్రవేశపెడుతారు. ప్రొఫెసర్‌గా, యూజీసీ చైర్మన్‌గా, ఆర్థికవేత్తగా, ఆర్‌బీఐ గవర్నర్‌గా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా, దేశ ఆర్థిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్ సింగ్ అందించిన తోడ్పాటుపైనా సభలో చర్చించి ఆయన మృతికి సంతాపం ప్రకటించనున్నారు.
Advertisement