మన్మోహన్ సింగ్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలి : మల్లు రవి
మన్మోహన్ సింగ్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు.
Advertisement
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం భారతదేశ ప్రజలకు తీర్చలేనటువంటి లోటు. మన్మోహన్ అంటేనే సంస్కరణలకు పెట్టింది పేరు.
భారత దేశం ఒక మహానేతను కోల్పోయిందని అన్నారు. అలాగే భారత ప్రధానిగా ఆయన చేసిన సేవలకు.. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కోరారు. మన్మోహన్ సింగ్ మృతికి సీడబ్ల్యూసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సీడబ్ల్యూసీ నేతలు మన్మోహన్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొంది.
Advertisement