సీఎం రేవంత్‌ను కలిసిన ప్రకాష్ గౌడ్.. పార్టీ మారడం ఖాయమే.?
రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం కూడా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోకే రానుంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్రకాష్ గౌడ్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.. ప్రకాష్ గౌడ్‌తో చర్చలు జరిపారు. దీంతో ఆయన పార్టీ మారతారంటూ వార్తలు జోరందుకున్నాయి.
మరోవైపు సోమవారం కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగనుంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం కూడా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోకే రానుంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ప్రకాష్ గౌడ్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గతంలో రేవంత్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ టీడీపీలో కలిసి పనిచేశారు. 2009లో ఫస్ట్ టైం రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ గౌడ్ వరుసగా గెలుస్తూ వచ్చారు. రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి, రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇటీవల నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాము నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయమై సీఎంను కలిశామని ఆ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు.