హెబ్రోన్ చర్చ్ పాస్టర్‌లతో బీఆర్‌ఎస్ నేతల భేటీ
ముషీరాబాద్ హెబ్రోన్ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ఇరువురు కలిసిపోయి హెబ్రోన్ చర్చికి మంచి పేరు తీసుకొని రావాలని బీఆర్‌ఎస్ నేతలు కోరారు.
హెబ్రోన్ చర్చ్ విషయంలో గానీ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాలలో గాని ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ఇరువురు కలిసిపోయి హెబ్రోన్ చర్చికి మంచి పేరు తీసుకొని రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ సొసైటీ సభ్యులు బ్రదర్ కురియన్, మరియు పీటర్ చారీలను కోరారు. హైదరాబాద్ హెబ్రోన్ చర్చ్ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ నేతలు క్రిస్టియన్ జెఎసి చైర్మన్ సాల్మన్ రాజు సొసైటీ సభ్యులు కలిశారు. సమాజంలో క్రైస్తవులకు ఒక మంచి పేరు ఉన్నది ఆ పేరుని చెడగొట్టకుండా సమాజానికి మార్గదర్శకంగా నిలబడి ఈ సంఘాన్ని స్థాపించిన బ్రదర్ భక్త సింగ్ పేరుని నిలబెట్టాలని మరియుతన ఆశయాలను ఆచరణలో పెట్టాలని బీఆర్‌ఎస్ నేతలు కోరారు.
తెలంగాణ మరియు ఆంధ్రాలో సుమారు పదివేల వరకు హెబ్రోన్ చర్చిలు ఉండటం జరిగిందని వారందరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ,ఈరోజు హెబ్రొన్ హెడ్ ఆఫీస్ లో ఇరువర్గాలు సామరస్యంగా కలిసిపోయిన సందర్భంగా వారిని అభినందించి , మళ్లీ బయటి వారి జోక్యం హెబ్రోన్ చర్చ్ కి సంబంధించిన సొసైటీ మరియు ట్రస్ట్ సభ్యుల మీద వుండకుండా అందరూ కలసిమెలసి వుండి సమాజానికి మంచి పేరు తీసుకుని రావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు.