ABN ఆంధ్రజ్యోతిపై బీఆర్ఎస్ కేసు.. ఎందుకంటే?

ABN ఎండీ వేమూరి రాధాకృష్ణ, డైరెక్టర్ భానుకృష్ణ, వెంకటకృష్ణతో పాటు మొత్తం 8 మందిపై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు.

Advertisement
Update:2024-05-31 18:57 IST

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేతపై తప్పుడు ప్రచారం చేశారంటూ ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌పై ఫిలింనగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈనెల 28న ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ కేసీఆర్ ప్రస్తావన చేసిందంటూ ABN న్యూస్ ఛానల్ తప్పుడు వార్తలను ప్రసారం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్.

ABN ఎండీ వేమూరి రాధాకృష్ణ, డైరెక్టర్ భానుకృష్ణ, వెంకటకృష్ణతో పాటు మొత్తం 8 మందిపై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఏబీఎన్ ఛానల్ ప్రసారం చేసిన వీడియోతో పాటు ఈడీ కౌంటర్‌ను సాక్ష్యాధారాలుగా సమర్పించారు.

కేసీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా పలు ఛానల్స్ కథనాలను ప్రసారం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు బాల్క సుమన్. ఎలాంటి నిర్ధారణ లేకుండా మీడియా కేసీఆర్‌ లాంటి నాయకుడిపై అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇకనైనా నిర్ధారణ చేసుకొని కథనాలు ప్రసారం చేయాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News