తెలంగాణలో జనసేనకు బిగ్‌ షాక్‌

పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగింది. కౌంటింగ్‌ ప్రారంభమై పలు రౌండ్లు ముగిసినా ఆ పార్టీ అభ్యర్థులు ఒక్కచోట కూడా ప్రభావం చూపించలేకపోతున్నారు.

Advertisement
Update:2023-12-03 15:24 IST

తెలంగాణ ఎన్నికల్లో ఓటర్లు పవన్‌ కల్యాణ్‌ను పట్టించుకోలేదు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 స్థానాల్లో బరిలోకి దిగినా.. ఎన్నికల ఫలితాల్లో ఎక్కడా వారి జాడే లేదు. తెలంగాణలో ఆదివారం ఉదయం నుంచే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి అత్యధిక స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌కి దూరంగా ఉంది. ఇక బీజేపీ 8 చోట్ల ఆధిక్యంలో ఉంది. కానీ, బీజేపీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగిన జనసేనకు మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. పవన్‌ను నమ్ముకొని పోటీచేసిన 8 మంది అభ్యర్థులను అసలు జనం పట్టించుకోలేదు.

పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగింది. కౌంటింగ్‌ ప్రారంభమై పలు రౌండ్లు ముగిసినా ఆ పార్టీ అభ్యర్థులు ఒక్కచోట కూడా ప్రభావం చూపించలేకపోతున్నారు. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్వయంగా ప్రచారం చేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరినా ఓటర్లు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. ముఖ్యంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో తమ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్‌ గెలుస్తారని జనసేన నేతలు నమ్మకం పెట్టుకున్నారు. కానీ, ఆ నియోజకవర్గంలో 5 రౌండ్లు ముగిసేసరికి జనసేన అభ్యర్థి వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

Tags:    
Advertisement

Similar News