భూ భారతి కాదు.. కాంగ్రెస్‌ కబ్జాలకు హారతి

రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లకు మంగళ హారతి : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

Advertisement
Update:2024-12-20 18:43 IST

అసెంబ్లీ ఆమోదించిన బిల్లు భూ భారతి కాదు.. కాంగ్రెస్ నేతల భూ కబ్జాలకు హారతి, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లకు మంగళ హారతి అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 75 లక్షల మంది రైతులకు 1.50 కోట్ల ఎకరాల భూములకు ధరణి హక్కులు కల్పించిందన్నారు. ఏదైన కుక్కను చంపాలంటే పిచ్చికుక్క అని ముద్ర వేస్తారని.. అలాగే ధరణిపై ముద్రవేసి చంపేశారని అన్నారు. కొత్త చట్టంతో రేపటి నుంచి పేదలకు కష్టాలు మొదలవుతాయన్నారు. 12 లక్షల మంది ధరణి వెబ్‌ సైట్‌ విజిట్‌ చేశారని.. 27 లక్షల ట్రాంజాక్షన్స్‌ జరిగాయన్నారు. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. విదేశీ సంస్థల చేతిలో ధరణి సాఫ్ట్‌వేర్‌ అనేది పూర్తిగా అబద్ధమన్నారు. జమాబందీ తిరిగి తెచ్చారని.. దీంతో అక్రమార్కులకు పండుగేనన్నారు. ఎమ్మార్వో సంతృప్తి చెందితేనే మ్యుటేషన్‌ అంటే అవినీతి దుఖాణానికి తలుపులు తెరిచినట్టేనన్నారు. రైతులతో కలిసి భూ భారతి చట్టంపై పోరాడుతామన్నారు. అసెంబ్లీలో నాలుగు కోట్ల మంది ప్రజల తరపున కొట్లాడమే తప్ప ఒక్క వ్యక్తి కోసం కాదన్నారు. తెలంగాణ పరువు అంతర్జాతీయంగా పోయిందన్నారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే చెప్పు చూపించిన వీడియో కూడా బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News