ప్రజాపాలనలో దేవుడి దరఖాస్తు..!

హన్మకండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో శివుడి పేరుతో అధికారులకు ఓ దరఖాస్తు అందింది. దరఖాస్తుదారుడి పేరు శివుడిగా, భార్య పేరు పార్వతి దేవిగా, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడుగా రాశారు.

Advertisement
Update:2024-01-07 13:30 IST

తెలంగాణలో ప్రజాపాలనకు విశేష స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్ర‌జ‌ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కోటి 25లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ కోటి 25లక్షల దరఖాస్తులో కొన్ని 6 గ్యారంటీల కోసమైతే, ఇంకొన్ని కొత్త రేషన్ కార్డుల కోసం. మరికొన్ని ధరణి సమస్యలపై వచ్చాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. ఓ దరఖాస్తు మాత్రం అధికారుల్ని ఆశ్చర్యపరిచింది.

మ్యాటర్ ఏంటంటే.. హన్మకండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో శివుడి పేరుతో అధికారులకు ఓ దరఖాస్తు అందింది. దరఖాస్తుదారుడి పేరు శివుడిగా, భార్య పేరు పార్వతి దేవిగా, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడుగా రాశారు. గృహలక్ష్మి, గృహజ్యోతితోపాటు ఇతర పథకాలకు అప్లై చేశారు.

దేవుడు పేరుతో ప్రజాపాలనలో దరఖాస్తు చేయడం గ్రామస్తులను, అధికారులను ఆశ్చర్యపరిచింది. ఈ పనిచేసింది ఎవరా అని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ముత్తారం గ్రామానికి చెందిన ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇలా శివుడి పేరుతో దరఖాస్తు చేసినట్లు తెలిసింది. దేవుడి మీద ఎంత భక్తి ఉంటే మాత్రం ఏకంగా శివుడి పేరు మీదే దరఖాస్తు చేయడం ఏంటని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News