అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తొక్కిసలాటలో చనిపోవడం వల్లే పోలీసుల చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ అరెస్ట్ విషయంలో తన జోక్యం ఏమి లేదని ఆయన స్పష్టం చేశారు.ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ లో కేంద్ర మంత్రులను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. తొక్కిసలాటలో ఓ మహిళా చనిపోయింది కాబట్టి పోలీసు చర్యల్లో భాగంగా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని తెలిపారు. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్న కారణంగా ఆయన్ను అరెస్టు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.