తెలంగాణ తల్లి ఉద్యమ తల్లి

ప్రజల్లోంచి ఆ తల్లిని ఎవరూ వేరు చేయలేరు

Advertisement
Update:2025-01-04 21:01 IST

తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ తల్లి ఆవిర్భించిందని..తెలంగాణ తల్లి ఉద్యమ తల్లి అని.. తెలంగాణ ఉద్యమంలో ఊరూరా ప్రతిష్టించుకున్న ఆ తల్లిని ఎవరూ ప్రజల నుంచి వేరు చేయలేరని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ తెలంగాణ తల్లిపై రచించిన 'అందరికీ అమ్మ' పుస్తకాన్ని కేసీఆర్‌ శనివారం ఆవిష్కరించారు. నూతన సంవత్సరం సందర్భంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు శనివారం ఎర్రవెల్లి ఫాం హౌస్‌ లో కేసీఆర్‌ ను కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ ను కలిసిన వారిలో మాజీ మంత్రులు జి. జగదీష్ రెడ్డి , వేముల ప్రశాంత్ రెడ్డి , ఎమ్మెల్సీలు తాతా మధు, ఎంసీ కోటిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్‌లు బండ నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి , రమావత్ రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, గ్యాదరి కిషోర్ కుమార్, కందాల ఉపేందర్ రెడ్డి, నల్లమోతు భాస్కర రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి , నర్సింహా రెడ్డి, పాల్వాయి స్రవంతి, రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, మందడి సైదిరెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, పల్లె ప్రవీణ్ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి, వలమల కృష్ణ, నూకల యుగంధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.




 


Tags:    
Advertisement

Similar News