మా నాన్న నర్సిరెడ్డి పేరు రేవంత్‌కు గుర్తుకు రాలేదా : డీకే అరుణ

పాలమూరు జిల్లా కోసం మానాన్న చనిపోయారని ప్రభుత్వానికి ఆయన పేరు గుర్తుకు రాలేదాని ఎంపీ డీకే అరుణ అన్నారు.

Advertisement
Update:2025-01-05 17:42 IST

పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు మా నాన్న చిట్టెం నర్సిరెడ్డి పేరు ప్రభుత్వానికి గుర్తుకురాలేదా అని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామని డీకే అరుణ పేర్కొన్నారు. కావాలంటే, నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులకు జైపాల్ రెడ్డి పేరు పెట్టుకోవాలని సూచించారు.

చిట్టెం నర్సిరెడ్డి పేరు ప్రభుత్వానికి గుర్తుకురాలేదా? సీఎం రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియకపోయినా, మా నాన్న సేవలు సీనియర్ మంత్రులకు గుర్తులేవా? జిల్లా కోసం మా నాన్న, సోదరుడు ప్రాణాలు అర్పించారు" అని డీకే అరుణ పేర్కొన్నారు. తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ఆమె తాజాగా ఓ న్యూస్ చానెల్ తో స్పందించారు. రైతు భరోసా కింద రూ. 15 వేలు ఇస్తామని రూ. 12 వేలే ఇవ్వడం రైతులను దగా చేయడమేని ఆమె తెలిపారు.

Tags:    
Advertisement

Similar News