న‌న్ను గెలిపిస్తే.. రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండ‌ర్లు

ఇదొక్కటే కాదు.. రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం, రూపాయికే న్యాయ సలహాలిస్తానని ఆయ‌న ప్ర‌క‌టించారు.

Advertisement
Update:2023-11-11 12:57 IST

గ్యాస్ సిలిండ‌ర్ రేటు విప‌రీతంగా పెరిగి సామాన్యుడికి భార‌మై కూర్చుంది. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం 200 రూపాయ‌లు తగ్గించింది. కానీ, తాను గెలిస్తే రూపాయికే ఏడాదికి నాలుగు సిలిండర్లు ఇస్తానంటున్నారు సనత్‌న‌గ‌ర్ నుంచి పోటీ చేస్తున్న ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి కుమ్మరి వెంకటేష్ యాదవ్.

బీఆర్ఎస్ 400కి.. కాంగ్రెస్ రూ.500కి

తెలంగాణ ఎన్నిక‌ల్లో తామ గెలిస్తే 400కే గ్యాస్ సిలిండ‌ర్ ఇస్తామ‌ని బీఆర్ఎస్ ప్ర‌కటించింది. కాంగ్రెస్ రూ.500కి సిలిండ‌ర్ ఇస్తామంటోంది. అంత‌కు మించి అన్న‌ట్లు కుమ్మ‌రి వెంక‌టేశ్ యాద‌వ్ ఏకంగా రూపాయికే నాలుగు సిలిండ‌ర్ల‌ని ప్ర‌క‌టించి, ఓట‌ర్ల‌ను ఆకట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇంకా చాలా ఉన్నాయి.

ఇదొక్కటే కాదు.. రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం, రూపాయికే న్యాయ సలహాలిస్తానని ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌న‌ను గెలిపిస్తే నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రతి వంద కుటుంబాలకు ఒక వలంటీరును నియమించి సేవ‌లందిస్తాన‌ని చెప్పుకొచ్చారు. 70 ఏళ్లు దాటిన వృద్ధులు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఎమర్జెన్సీ పానిక్ బటన్ నొక్కగానే వచ్చి సాయం అందిస్తానంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న‌లు, వాగ్దానాలు వెంక‌టేశ్ యాద‌వ్‌కు ఎన్ని ఓట్లు తెస్తాయో తెలియాలంటే కౌంటింగ్ దాకా ఆగాల్సిందే మ‌రి!

Tags:    
Advertisement

Similar News