పెద్దగట్టు జాతరకు వెళ్లే వారికి అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

సూర్యాపేట పెద్దగట్టు జాతర కావడంతో ఆయా రూట్లలో పలు వాహనాలను మళ్లిస్తున్నారు.

Advertisement
Update:2025-02-16 16:22 IST

సూర్యాపేట జిల్లాలో వద్ద ఉన్న గొల్లగట్టుపై పెద్దగట్టు జాతర ఘనంగా ప్రారంభం అయింది. ఈ జాతర ఐదు రోజుల పాటు ఘనంగా జరగనుంది. ఈ జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ గొల్లగట్టు జాతరను యాదవులు పెద్ద ఎత్తున చేసుకుంటారు. అలాగే వారితో పాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు ఈ జాతకు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో పాటు వచ్చి.. లింగమంతుల స్వామిని దర్శించుకొని ప్రసాధాలు సమర్పిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం వెళ్లే వాహనదారులకు సూర్యపేట పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. తెలంగాణలో రెండవ అతి పెద్ద జాతర అయిన సూర్యపేట పెద్దగట్టు జాతర కావడంతో ఆయా రూట్లలో పలు వాహనాలను మళ్లిస్తున్నారు.

జాతర ఇవాళ్టి నుంచి దాదాపు 5 రోజుల పాటు కొనసాగనుంది. జాతరకు తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల ప్రజలు హాజరవుతారు. ఈ నేపథ్యంలో రద్దీ తగ్గే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఈ రోజు పోలీసులు తెలిపారు. దీంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను దారీ మళ్లించారు. విజయవాడకు వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలకు వాహనాలను..కోదాడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా మళ్లిస్తున్నారు. కాగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు రెండు రోజుల పాటు అమలు అవుతాయని, వాహనదారులు ఈ ఆంక్షలను గమనించి సహకరించాలని పోలీస్ అధికారులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News