విద్యార్థులకు ప్రకృతి, జీవ వైవిధ్యం అందించాలన్న లక్ష్యంతో
ఎకోటూరిజం, వృక్ష క్షేత్రం, వర్చువల్ వైల్డ్‌లైఫ్ మాడల్ సఫారీలను ప్రారంభించిన సీఎం
హైదరాబాద్ నగరంలో సుందరీకరణ, పచ్చదం పెంపొందించి అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో సరికొత్త హంగులతో అభివృద్ధి చేసిన ఎకోటూరిజం, వృక్ష క్షేత్రం, వర్చువల్ వైల్డ్‌లైఫ్ మాడల్ సఫారీలను సీఎం ప్రారంభించారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వృక్ష పరిచయ క్షేత్రం పేరుతో ఏర్పాటైన బొటానికల్ థీమ్ పార్కు, వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీలను ప్రారంభించారు. అనంతరం అటవీ పర్యవరణ హిత కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. నిర్వాహకులు ఎకో టూరిజం విధానాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. సందర్శకులు, విద్యార్థులను ఆకర్షించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన పర్యావరణ హిత, వృక్ష పరిచయ క్షేత్రంలో 75 రకాల థీమ్ పార్కులు ఉన్నాయన్నారు. విద్యార్థులకు ప్రకృతి, జీవ వైవిధ్యం అందించాలన్న లక్ష్యంతో థీమ్ పార్కులు ఏర్పాటు చేశామన్నారు. సంగీత పరికరాలు, ఆట వస్తువులు ఏ చెట్ల నుంచి వస్తున్నాయో విద్యార్థులకు తెలపడానికి మ్యూజికల్ గార్డెన్, స్పోర్ట్స్ గార్డెన్ వంటివి చేశామన్నారు. ఇలా ఒక్కో థీమ్‌తో ఒక్కో గార్డెన్‌ను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. నూతన వాహనాలను ప్రారంభించి బ్యాటరీ వాహనంలో ప్రయాణిస్తూ గార్డెన్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ , పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ , మేయర్ గద్వాల విజయలక్ష్మి , అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.