డిప్యూటీ సీఎం భట్టికి ఏఐసీసీ కీలక బాధ్యతలు
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జార్ఖండ్ పరిశీలకుడిగా కీలక బాధ్యతలు అప్పగించింది
Advertisement
రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గరు చొప్పున పరిశీలకులను ఏఐసీసీ నియమించింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మహారాష్ట్ర, జార్ఖండ్ ముగ్గరు చొప్పున సీనియర్ నేతల జాబితా ప్రకటించింది. అందులో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జార్ఖండ్ పరిశీలకుడిగా కీలక బాధ్యతలు అప్పగించింది. జార్ఖండ్ లో రేపు ఎన్నికల ఫలితాల తర్వాత జరగబోయే పరిణామాలను భట్టి విక్రమార్క సమన్వయం చేయనున్నారు. కాగా, జార్ఖండ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
Advertisement