కేటీఆర్‌, నాగార్జున పిటిషన్లపై విచారణ వాయిదా

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై వేర్వేరుగా దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్లపై నవంబర్‌ 13కు వాయిదా

Advertisement
Update:2024-10-30 11:59 IST

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్‌ వేర్వేరుగా దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్లపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. కొండా సురేఖ తరఫున న్యాయవాది గురుమిత్‌ సింగ్‌ హాజరయ్యారు. రెండు పిటిషన్లపై విచారణను కోర్టు నవంబర్‌ 13కు వాయిదా వేసింది.ఈ కేసులో బుధవారం తుల ఉమ, బాల్క సుమన్‌, సత్యవతి రాథోడ్‌ వాంగ్మూలాలను నమోదు చేయాల్సి ఉన్నది. ఇప్పటికే కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌కుమార్‌ వాంగ్మూలాలను రికార్డు చేసిన సంగతి తెలిసిందే.

తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్‌ పరువు నష్టం దావా పిటిషన్‌ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా తన గురించి మంత్రి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌ కోర్టుకు రాతపూర్వకంగా అందించారు. దీనిపై 23 రకాల ఆధారాలను కోర్టుకు సమర్పించారు. మరోవైపు సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వివరణ వాయిదా పడింది. ఈ కేసులో మంత్రి సురేఖా తన వాంగ్మూలం ఇవ్వడానికి కోర్టుకు హాజరుకావాల్సి ఉన్నది. అయితే జడ్జి సెలవులో ఉండటంతో వచ్చే 13వ తేదీకి వాయిదా పడింది. 

Tags:    
Advertisement

Similar News