సిరిసిల్లా: స్కూల్ బస్ ను ఢీకొట్టిన ఆర్టీసి బస్సు, 15 మంది విద్యార్థులకు గాయాలు... కేటీఆర్ ఆరా

స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు అత్యంత వేగంగా వచ్చి ఢీ కొట్ట‌డంతో స్కూల్ బ‌స్సులోని పిల్ల‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. హాహాకారాలు చేశారు. ముందుకు పడిపోయి కొందరు, రాడ్లు గుద్దుకొని మరి కొందరికి గాయాలయ్యాయి.

Advertisement
Update:2023-01-31 12:37 IST

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సమీపంలో ఓ పాఠశాల బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి మెరుగ్గా ఉంది.

విజ్ఞాన్ స్కూల్‌కు చెందిన బస్సును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని అనుమానిస్తున్నారు.

స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు అత్యంత వేగంగా వచ్చి ఢీ కొట్ట‌డంతో స్కూల్ బ‌స్సులోని పిల్ల‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. హాహాకారాలు చేశారు. ముందుకు పడిపోయి కొందరు, రాడ్లు గుద్దుకొని మరి కొందరికి గాయాలయ్యాయి. కొందరు చిన్నారులకు తలపై దెబ్బ తగిలి రక్తం వచ్చింది. విష‌యం తెలిసిన వెంట‌నే త‌మ పిల్ల‌ల‌కు ఏమైంద‌నే భ‌యంతో త‌ల్లిదండ్రులు, స్కూల్ యాజ‌మాన్యం సంఘ‌ట‌నా స్థ‌లానికి ప‌రుగులు తీశారు.

ఆర్టీసీ బస్సులోని ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద‌రాబాద్‌కు తరలించాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News