మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేత న్యూజిలాండ్‌

ఫైనల్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై కివీస్‌ జట్టు 32 రన్స్‌ తేడాతో గెలుపు

Advertisement
Update:2024-10-20 23:45 IST

మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేతగా న్యూజిలాండ్‌ నిలిచింది. దుబాయి వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై కివీస్‌ జట్టు 32 రన్స్‌ తేడాతో గెలుపొందింది. దీంతో మొదటిసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్నది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 రన్స్‌ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 126 రన్స్‌ మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు లారా వోల్వార్ట్‌ (33), తంజ్నిమ్‌ బ్రిట్స్‌ (17) మొదటి వికెట్‌కు 51 రన్స్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ తర్వాత సౌతాఫ్రికా జట్టు వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అన్నేకే జోష్‌ (9), మారిజేన్‌ కాప్‌ (8) నాడిన్‌ డి క్లర్క్‌ (6) వరుసగా పెవిలియన్‌ దారిపట్టారు. కివీస్‌ బౌలర్లలో అమేలియా కెర్, రోజ్‌మేరీ చెరో మూడు వికెట్లు తీయగా.. కార్సన్‌, ఫ్రాన్‌, జోనాస్‌, బ్రూక్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు కివీస్‌ బ్యాటర్లలో అమేలియా కెర్‌ (43), బ్రూక్‌ హాలిడే (38) సుజీ బేట్స్‌ (31) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంలాబా 2, ఆయబొంగ ఖాకా, ట్రయాన్‌, నాడిన్‌ డి క్లర్‌ చెరో వికెట్‌ తీశారు. 

Tags:    
Advertisement

Similar News