విడాకుల వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చు
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలపై చాహల్ పోస్ట్
\టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్నిరోజులు సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దీనికితోడు చాహల్ తన ఇన్‌స్టా ఖాతాలో ధనశ్రీ ఫొటోలను తొలిగించడంతో ప్రచారం ఎక్కువ అయ్యింది. ఈ నేపథ్యంలో బుధవారం ధనశ్రీ వర్మ ఓ పోస్టు చేసింది. కొన్నిరోజులుగా మీడయాలో వస్తున్న వార్తల వల్ల తాను మానసిక వేధనకు గురవుతున్నట్లు ఆమె ఆ పోస్టులో పేర్కొన్నది. నిజానిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా చాహల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆ అంశంపై స్పందించాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చు అని పోస్టు చేశాడు.
అభిమానుల మద్దతు లేకుంటే నేను ఇంత ఎదిగేవాడిని కాదు. వారి ప్రేమకు ధన్యవాదాలు. అయితే ఈ ప్రయాణం 'ఓవర్'కు ఎంతో దూరంలో ఉన్నది. అయితే నా దేశం,జట్టు, అభిమానుల కోసం ఇంకా ఎన్నో అద్భుతమైన 'ఓవర్స్' మిగిలే ఉన్నాయి. కుమారుడిగా, సోదరుడిగా, ఫ్రెండ్‌గా, ఒక క్రీడాకారుడిగా ఎంతో గర్వపడుతున్నాను. ఇటీవల సంఘటనలు ముఖ్యంగా నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై అభిమానుల ఆసక్తిని నేను అర్థం చేసుకుంటాను. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులు నా దృష్టికీ వచ్చాయి. అయితే అవి నిజం కావచ్చు.. కాకపోవచ్చు.
ఇలాంటి ఊహాగానాల్లో మునిగిపోకుండా ఉండాలని మీ అందరికీ విన్నవిస్తున్నాను. ఇలాంటివి నాకు, నా కుటుంబానికి ఎంతో బాధ కలిగిస్తాయి. ఇతరుల మంచి కోరుకోవాలని నా కుటుంబం నాకు నేర్పించింది. విజయానికి దగ్గరి దారులు కాకుండా అకింతభావం, శ్రమతోఎ నేను ప్రయత్నిస్తాను. ఇలాంటి విలువలకే ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. నాపై సానుభూతి కాఉండా ప్రేమ, మద్దతు చూపెట్టాలని ఎప్పుడూ కోరుకుంటాను అని చాహల్ పేర్కొన్నాడు. తాజా పోస్టుతో చాహల్-ధనశ్రీ విడాకుల అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చిస్తున్నారు.
యూట్యూబర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్, డెంటిస్ట్ అయిన ధన శ్రీ వర్మకు, స్పిన్నర్ చాహల్‌కు డిసెంబర్ 22, 2020లో వివాహం జరిగింది. వీరిద్దరూ సోషల్ మీడియాలెఓ చాలా యాక్టివ్‌గా ఉంటారు.