చదరంగ చరిత్రలో అరుదైన రికార్డు!

ఇతిహాస క్రీడ చదరంగంలో ఓ అరుదైన రికార్డును భారత్ కు చెందిన అక్కా-తమ్ముడు జోడీ నెలకొల్పారు. గ్రాండ్ మాస్టర్లుగా సరికొత్త చరిత్ర సృష్టించారు.

Advertisement
Update:2023-12-02 16:30 IST

ఇతిహాస క్రీడ చదరంగంలో ఓ అరుదైన రికార్డును భారత్ కు చెందిన అక్కా-తమ్ముడు జోడీ నెలకొల్పారు. గ్రాండ్ మాస్టర్లుగా సరికొత్త చరిత్ర సృష్టించారు.

మేధో క్రీడ చదరంగంలో భారత క్రీడాకారుల అరుదైన రికార్డుల పరంపర కొనసాగుతోంది. భారత చదరంగ సంచలన క్రీడాకారులు ప్రజ్ఞానంద్, వైశాలీల జోడీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు.

తమిళనాడులోని ఓ తెలుగు మూలాలున్న కుటుంబం నుంచి భారత చదరంగ క్రీడలోకి దూసుకొచ్చిన గ్రాండ్ ప్రజ్ఞానంద్, అతని సోదరి వైశాలి గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన తొలి అక్కాతమ్ముడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

భారత మూడో మహిళ వైశాలి...

అంతర్జాతీయ చెస్ సమాఖ్య నిబంధనల ప్రకారం 2500 రేటింగ్ పాయింట్లు సాధించిన చదరంగ క్రీడాకారులకు గ్రాండ్ మాస్టర్ హోదా ఇస్తారు. భారత చదరంగ చరిత్రలో ఇప్పటి వరకూ పురుషుల, మహిళల విభాగాలలో 80 మందికి పైగా గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించినవారిలో ఉన్నారు.

2023 ఇలోబ్రెగాట్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో పాల్గొని..గ్రాండ్ మాస్టర్ హోదా పొందటానికి అవసరమైన పాయింట్లను ప్రజ్ఞానంద్ సోదరి వైశాలి సాధించడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పింది.

భారత మహిళా చెస్ లో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన మూడో మహిళగా వైశాలి నిలిచింది. వైశాలి కంటే ముందే ఇదే ఘనతను సాధించినవారిలో తెలుగుతేజాలు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరి సరసన వచ్చి వైశాలి సైతం చేరింది.

తొలి అక్కా-తమ్ముడి జోడీ...

ప్రపంచ చదరంగ చరిత్రలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పురుషుల, మహిళల విభాగాలలో గ్రాండ్ మాస్టర్లుగా నిలవడం ఇదే మొదటిసారి. పురుషుల విభాగంలో ప్రజ్ఞానంద్ అత్యంత పిన్నవయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పితే...ఇప్పుడు ప్రజ్ఞానంద్ అక్క వైశాలి సైతం 2500 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించడం ద్వారా గ్రాండ్ మాస్టర్ టైటిల్ చేజిక్కించుకోగలిగిందిప్రపంచ చెస్ పురుషుల, మహిళల విభాగాలలో సంచలన విజయాలు, అరుదైన ఘనతలు సాధిస్తూ దేశానికే గర్వకారణంగా నిలిచిన గ్రాండ్ మాస్టర్ల ద్వయం ప్రజ్ఞానంద, వైశాలిలపై తమిళనాడు క్రీడామంత్రి ఉదయనిధి, ముఖ్యమంత్రి ఎమ్ కె స్టాలిన్ లపై ప్రశంసల వర్షం కురిపించారు.

2500కు ఎలో రేటింగ్ సాధించిన భారత దిగ్గజ గ్రాండ్ మాస్టర్లలో విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, దివ్యేందు బారువా,ప్రజ్ఞానంద్ మాత్రమే ఉన్నారు.

చైనాలోని హాంగ్జు ఆసియా క్రీడల పురుషుల, మహిళల విభాగాలలో ప్రజ్ఞానంద్, అతని సోదరి వైశాలీ రజత పతకాలు సాధించారు. అంతేకాదు..కాండిడేట్స్ చెస్ టైటిల్ రౌండ్ కు పురుషుల, మహిళల విభాగాలలో గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్, గ్రాండ్ మాస్టర్ వైశాలి ఇప్పటికే అర్హత సంపాదించగలిగారు.

Tags:    
Advertisement

Similar News