మ‌హిళ‌ల ఐపీఎల్ లో కనీస వేలం ధర 10 లక్షలు!

బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రారంభ మహిళా ఐపీఎల్ లో కనీస వేలం ధరను పాలకమండలి నిర్ణయించింది.మార్చి 5నుంచి 23 వరకూ ఐపీఎల్ హంగామా సాగనుంది.

Advertisement
Update:2023-01-17 12:18 IST

మ‌హిళ‌ల ఐపీఎల్ లో కనీస వేలం ధర 10 లక్షలు!

బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రారంభ మహిళా ఐపీఎల్ లో కనీస వేలం ధరను పాలకమండలి నిర్ణయించింది. మార్చి 5నుంచి 23 వరకూ ఐపీఎల్ హంగామా సాగనుంది....

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు..ఇప్పటికే పురుషుల ఐపీఎల్ తో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ దండిగా లాభాలు ఆర్జిస్తోంది. మహిళకు సైతం ఐపీఎల్ నిర్వహించడం ద్వారా క్రికెట్ ను మరింత బజారు క్రీడగా మార్చాలని నిర్ణయించింది.

మార్చి 5 నుంచి మహిళా ఐపీఎల్...

గత కొద్దిసంవత్సరాలుగా..పురుషుల ఐపీఎల్ కు అనుబంధంగా మహిళలకు చాలెంజర్ సిరీస్ పేరుతో అనధికారికంగా ఐపీఎల్ ను నిర్వహిస్తూ వస్తారు. కేవలం మూడుజట్లతో నిర్వహించిన చాలెంజర్ లీగ్ తూతూమంత్రంగానే సాగుతూ వచ్చింది.

అయితే..మొత్తం ఐదు ఫ్రాంచైజీలకు చెందిన ఐదుజట్లతో ప్రారంభ మహిళా ఐపీఎల్ ను ఈ సీజన్ నుంచే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే మీడియా ప్రసారహక్కుల విక్రయం తంతును పూర్తి చేసింది.

అంబానీలకు చిక్కిన మీడియా హక్కులు..

క్రికెట్ ను లాభసాటిగా వ్యాపారంగా మలచుకొన్న ముకేశ్ అంబానీకి చెందిన వయాకోమ్ 18 మీడియా సంస్థే మహిళా ఐపీఎల్ ప్రసారహక్కులను సొంతం చేసుకొంది.

వ‌చ్చే ఐదేళ్ల (2023- 2027 ) కాలానికి ఈ సంస్థ మీడియా ప్ర‌సార హ‌క్కుల‌ను కైవసం చేసుకోగలిగింది.

‘మ‌హిళ‌ల ఐపీఎల్ మీడియా హ‌క్కులు దక్కించుకొన్నందకు వయాకోమ్ సంస్థకు శుభాకాంక్ష‌లు అంటూ బీసీసీఐ కార్యదర్శి జే షా సోషల్ మీడియా ద్వారా ఓ అభినందన సందేశం పంపారు.. బీసీసీఐ పట్ల మీకు ఉన్న విశ్వాసానికి ధ‌న్య‌వాదాలు అంటూ అభినందించారు.

మహిళా ఐపీఎల్ మొదటి ఐదుసీజన్ల ప్రత్యక్ష ప్రసార హ‌క్కుల కోసం వయాకోమ్ సంస్థ 951 కోట్ల రూపాయలు చెల్లించడానికి ముందుకు వచ్చింది. మ్యాచ్ కు 7కోట్ల 9 లక్షలు...

ఐపీఎల్ పురుషుల మ్యాచ్ కు సగటున ప్రసారహక్కుల ద్వారా 50 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న బీసీసీఐ..మహిళా ప్రసారహక్కులను మాత్రం మ్యాచ్ కు 7 కోట్ల 9 లక్షల రూపాయలకే ఖరారు చేసింది.

పురుషుల జ‌ట్టుతో స‌మాన వేతనం త‌ర్వాత‌.. మ‌హిళ‌ల క్రికెట్‌కు ఇది అతిపెద్ద, కీల‌క‌మైన అడుగు’ అని జై షా ట్వీట్ చేశాడు. 2023-2027 వ‌ర‌కు మ‌హిళ‌ల ఐపీఎల్ హ‌క్కులను వయాకోమ్ సంస్థ‌కు బీసీసీఐ కట్టబెట్టింది.

మహిళా క్రికెటర్ల కనీసం వేలం ధర....

ప్రారంభలీగ్ లో తలపడే మొత్తం ఐదు ఫ్రాంఛైజీలకు చెందిన జట్ల కోసం నిర్వహించనున్న వేలంలో క్రికెటర్ల స్థాయిని బట్టి కనీసం వేలం ధరను బీసీసీఐ ఖరారుచేసింది. జ‌న‌వ‌రి 25వ తేదీన మ‌హిళ‌ల ఐపీఎల్ ఫ్రాంఛైజీల‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

ఆ తర్వాత మహిళా క్రికెటర్ల వేలం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ఉన్న మ‌హిళా క్రికెట‌ర్ల‌కు కనీస వేలం ధర 50 లక్ష‌లు, రూ. 40 ల‌క్ష‌లు, రూ.30 ల‌క్ష‌లుగాను... మిగిలిన క్రికెటర్లకు రూ. 20 ల‌క్ష‌లు, రూ. 10 ల‌క్ష‌లు క‌నీస ధ‌రను బీసీసీఐ ఖరారు చేసింది.

మొత్తం మీద అంతర్జాతీయ క్రికెటర్ల కనీస వేలంధరను 50 లక్షలు..దేశవాళీ క్రికెటర్ల ధరను 10 లక్షలుగానూ ఐపీఎల్ పాలకమండలి నిర్ణయించింది.

Tags:    
Advertisement

Similar News