ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్స్‌ విజేత ఎవరో?

మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్‌ ఆరంభం;

Advertisement
Update:2025-03-09 12:43 IST

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత ఎవరో నేడు తేలిపోనున్నది. దుబాయ్‌ వేదికగా జరిగే తుదిపోరులో భారత్‌, న్యూజిలాండ్‌ ట్రోఫీ కోసం తలపడనున్నాయి. ఈ టోర్నీలో వరుసగా నాలుగు విజయాలతో ఫైనల్‌లోకి భారత్‌ లీగ్‌ దశలో న్యూజిలాండ్‌ను ఓడించిన ఉత్సాహంతో మ్యాచ్‌ కు సిద్ధమైంది. 2000 సంవత్సరం కెన్యాలో జరిగిన ఛాంపియన్‌ ట్రోఫీ ఫైనల్‌లో కివీస్‌ చేతిలో ఓటమికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నది. భారత కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు ఇదే చివరి వన్డే అనే ప్రచారం జరుగుతుండగా.. జట్టుకు మరో ఐసీసీ ట్రోఫీ అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్, కేఎల్‌ రాహుల్, హర్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజాలతో భారత బ్యాటింగ్‌ పటిష్టంగా కనిపిస్తున్నది. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్‌దీప్‌ యాదవ్‌లతో స్పిన్‌ , మహమ్మద్‌ షమీ, హార్దిక్‌ పాండ్యాలతో పేస్‌ బౌలింగ్‌ పటిష్టంగా కనిపిస్తున్నది. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌ లో భారత్‌ పై మెరుగైన రికార్డును కొనసాగించాలని న్యూజిలాండ్‌ భావిస్తున్నది.

దుబాయ్‌ గ్రౌండ్‌ భారత్‌కు అనుకూలమని ప్రచారం సాగుతున్న వేళ అక్కడే ఫైనల్‌ జరుగుతుండటంతో మ్యాచ్‌ పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సుమారు 25 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌, కివీస్‌ తలపడుతున్నాయి. అన్ని విభాగాల్లో రెండు జట్లు సమానంగా కనిపిస్తున్నా ఫైనల్‌లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు.

న్యూజిలాండ్‌కు ఇది మూడో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌. 2000లో ఆ జట్టు భారత్‌ను ఓడించి కప్పు గెలుచుకున్నది. 2009లో ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్‌లో ఓడింది. ఇక ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీలో విల్‌ యంగ్‌, విలియమ్సన్‌, మిచెల్‌, లేథమ్‌తో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగానే ఉన్నది. రచిన్‌ రవీంద్ర కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక బౌలర్లలో కివీస్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్నీ 4 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే గాయం కారణంగా ఆయన మ్యాచ్‌కు దూరంగా ఉంటాడనే ప్రచారం జరుగుతున్నది. అదే జరిగితే న్యూజిలాండ్‌కు కొంచెం ఇబ్బందికరమే.

పిచ్‌ ఎలా ఉన్నదంటే

దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో భారత్‌, పాక్‌ మధ్య గ్రూప్‌ దశ మ్యాచ్‌ జరిగిన పిచ్‌పైనే ఫైనల్‌ ఆడనున్నారు. పిచ్‌ మందకొడిగా ఉంటుంది. స్పిన్నర్లకు మంచి సహకారం అభిస్తుంది. రన్స్‌ చేయడం అంత ఈజీ కాదు. 270-280 చేసినా బెస్ట్‌ స్కోర్‌ అవుతుంది. ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీలో దుబాయ్‌లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో సగటు స్కోరు 246

Tags:    
Advertisement

Similar News