అసాధారణ మ్యాచ్‌.. అపూర్వ విజయం

ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌ కైవసంపై రాష్ట్రపతి, ప్రధాని, రాహుల్‌. రేవంత్‌రెడ్డి ప్రశంసలు;

Advertisement
Update:2025-03-09 23:00 IST

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌ కైవసం చేసుకున్నది. 12 ఏళ్ల తర్వాత ఈ టైటిల్‌ సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. టీమిండియా విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అసాధారణ మ్యాచ్‌.. అపూర్వ విజయం అంటూ పేర్కొన్నారు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని మన జట్టు గెలుచుకోవడం గర్వంగా ఉన్నదని ట్వీట్‌ చేశారు. టోర్నమెంట్‌ సొంతం. అద్భుతంగా ఆడారంటూ జట్టు సభ్యులను ప్రశంసించారు. మరోవైపు.. 'వన్‌ టీమ్‌.. వన్‌ డ్రీమ్‌.. వన్‌ ఎమోషన్‌' అని పేర్కొంటూ బీసీసీఐ మ్యాచ్‌ ఫొటోలను షేర్‌ చేసింది.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని మూడుసార్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. టీమిండియాకు శుభాకాంక్షలు - రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

'స్మాషింగ్‌ విక్టరీ' భారత జట్టులోని ప్రతి ఒక్కరూ కోట్లాది మంది హృదయాలను గర్వంతో ఉప్పొంగేలా చేశారు - కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ గెలువడం ఆనందంగా ఉన్నది. అద్భుత ఆట తీరుతో మన జట్టు మరోసారి సత్తా చాటింది - సీఎం రేవంత్‌ రెడ్డి

Tags:    
Advertisement

Similar News