టీమిండియా టార్గెట్‌ 252

హాఫ్‌ సెంచరీలతో రాణించిన డారిల్‌ బ్రావ్‌వెల్‌;

Advertisement
Update:2025-03-09 18:15 IST

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ప్రత్యర్థి జట్టు నిర్ణీత 50 ఓవర్లలో వికెట్లు కోల్పోయి 251 రన్స్‌ చేసింది. డారిల్‌ (63), బ్రావ్‌వెల్‌ (53*) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. రచిన్‌ (37), ఫిలిప్స్‌ (34) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. కెప్టెన్‌ శాంట్నర్‌ (8) రనౌటయ్యాడు. భారత బౌలర్లలో వరుణ్‌, కుల్దీప్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షమి, జడేజా ఒక్కో వికెట్‌ తీశారు. 

Tags:    
Advertisement

Similar News